సమాచార హక్కు చట్టం, 2005
భారత ప్రభుత్వం చేసిన సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005
(http://www.persmin.nic.in) నుంచి అమలు లోకి వచ్చింది. భారత పౌరులకి ప్రజాధికారుల నియంత్రణ లో ఉన్న సమాచారాన్ని, రహస్యాలు లేకుండా అందుబాటులొకి తెచ్చి తద్వారా ఆ సంస్థలు బాధ్యతాయుతంగా కార్య కలాపాలు నిర్వహించేలా చెయ్యడమే ఈ సమాచార హక్కు చట్టం యొక్క ఉద్దేశం. అయితే, చట్టంలోని 8,9 సెక్షన్ల కింద, కొన్ని రకాల సమాచారాలు ఈ చట్టం పరిధిలోంచి మినహయించబడ్డాయి. సమాచారంకోరే అభ్యర్ధనలను పరిశీలించడానికి ఈ చట్టం ద్వారా ఒక ప్రధాన ప్రజా సమాచార అధికారి (Chief Public Information Officer) నియమించబడతారు.
ఈ చట్టం కింద భారతీయ రిజర్వ్ బ్యాంక్ బాధ్యతలు:
సమాచార హక్కు చట్టం 2005, నిర్వచనం ప్రకారం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా ఒక ప్రజాధికార సంస్థ. అందువల్ల ప్రజలకు సమాచారాన్ని వెల్లడించాల్సిన బాధ్యత భారతీయ రిజర్వ్ బ్యాంక్ పైన ఉంది.
సమాచార హక్కు చట్టం 2005 ని అనుసరించి భారతీయ రిజర్వ్ బ్యాంకులొ పారదర్శకత
అధికారి (Transparency Officer) నియామకం
కేంద్ర సమాచార కమిషన్ (Central Information Commission), సమాచార హక్కు చట్టంలోని 19 (8) (a) సెక్షన్ ద్వారా లభించిన అధికారాల అనుసారంగా, నవంబర్ 15, 2010 న అన్ని ప్రజాధికార సంస్థలకీ జారీచేసిన ఆదేశాలని అనుసరించి, శ్రీ ఆర్.ఎల్. దాస్ (Chief General Manager-in-charge) పారదర్శకత అధికారి (Transparency Officer) గా నియమించ బడ్డారు.
ఆయన వివరాలు ఈకింద ఇవ్వబడ్డాయి:
శ్రీ ఆర్. ఎల్. దాస్
చీఫ్ జనరల్ మేనేజర్ -ఇన్- చార్జ్
హ్యూమన్ రిసౌర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్ మెంట్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఆఫీస్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ (20 th Floor)
షహీద్ భగత్ సింగ్ మార్గ్, ఫోర్ట్
ముంబయి - 400001
ఫోన్: 22610301
సమాచార హక్కు చట్టం 2005 లోని సెక్షన్ 4 (1) (b)
సెక్షన్ 4(1) (b) |
చట్ట ప్రకారం ప్రచురించాల్సిన సమాచారం |
(i) |
సంస్థ వివరాలు, కార్యకలాపాలు, విధులు |
(ii) |
అధికారుల, ఉద్యోగుల అధికారాలు, విధులు |
(iii) |
నిర్ణయప్రక్రియకు అనుసరించే విధానాలు, పర్యవేక్షణ విధానాలు, జవాబుదారీ |
(iv) |
కార్యనిర్వహణకు విధించిన నియమాలు ఆదేశాలు, |
(v) |
బ్యాంక్ ఆధీనంలో ఉన్నమరియు ఉద్యొగులు విధి నిర్వహణలో అనుసరించే నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, నిబంధన సంగ్రహాలు రికార్డ్స్ |
(vi) |
రిజర్వ్ బ్యాంక్ దగ్గర, లేదా దాని నియంత్రణలో ఉండే వివిధ పత్రాల వర్గీకరణ స్టేట్‌మెంట్ |
(vii) |
విధానాలు రూపొందించడంలో, వాటి ఆచరణలో, ప్రజలతో సంప్రదింపులకి, వారి అభ్యర్దనల పరిశీలనకు, వీలుకల్పించే వ్యవస్థ వున్నట్లయితే, ఆ వివరాలు |
(viii) |
సలహా కోసం ఏర్పరచిన, ఇద్దరు లేక అంతకు మించి సభ్యులు ఉన్న, బోర్డ్లు, కౌన్సిల్స్, కమిటీల జాబితా. వీటి సమావేశాల్లో ప్రజలు పాల్గొనవచ్చా ? లేక ఆ సమావేశాల ’మినిట్స్’ ప్రజలకు అందు బాటులో వుంటాయా? |
(ix) |
అధికారుల, ఉద్యోగుల సూచిక |
(x) |
నియమానుసారంగా చెల్లించే అధికారుల, ఉద్యోగుల జీతభత్యాలు; పరిహారాల చెల్లింపుకి అనుసరించే నియమావళి
|
(xi) |
ప్రాతినిధ్య సంస్థలకు కేటాయించిన బజెట్, ప్రణాళికల వివరాలు, వెచ్చించదలచిన మొత్తం, చెల్లింపుల వివరాలు |
(xii) |
వర్తించదు |
(xiii) |
రాయితీలు, అనుమతులు, ఆథరైజేషన్స్ పొందినవారి వివరాలు |
(xiv) |
ఎలెక్ట్రానిక్ మాధ్యమంలొ లభ్యమయే సమాచార వివరాలు |
(xv) |
సమాచారం పొందడానికి ప్రజలకు లభించే సదుపాయాలు. ప్రజలకోసం నిర్వహించే గ్రంధాలయాల పనివేళలు |
(xvi) |
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల పేర్లు, పదవి, ఇతర వివరాలు. |
గ్రంథాలయ సదుపాయం
భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ కార్యాలయం లో గ్రంథాలయం ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.45 వరకు తెరిచి ఉంటుంది. ఇది ప్రధానంగా బ్యాంక్ సిబ్బంది కొసమే అయినా, విద్యావేత్తలు, విద్యార్ధులు, పరిశొధకులు కూడా ఈ సదుపాయం ఉపయోగించు కోవచ్చు
రిజర్వ్ బ్యాంక్ నుంచి సమాచారం కోరడం
రిజర్వ్ బ్యాంకులో సుస్థిరమైన సమాచార ప్రచార విధానం ఉంది. దీనిలో భాగంగా, దేశ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన విషయాలపై గణాంకాలని ప్రతి రోజు, వారం, నెల, మూడు నెలలు, ఆరు నెలలూ, సంవత్సర వ్యవధుల్లో, క్రమం తప్పకుండా సమాచారాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఇంతేగాక, సందర్భావసరంగా ప్రత్యేక పత్రాలు, నివేదికలద్వారా కూడా సమాచారాన్ని అందిస్తుంది.
బ్యాంకింగ్, ఆర్థిక, విదేశీమారక ద్రవ్య సంబంధిత అంశాలూ, తదితర అంశాలపై ఉన్న సూచనలని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. ఇంకా, ప్రజలకు పనికివచ్చే సమాచారాన్ని ప్రతిరోజూ పత్రికా ప్రకటనల ద్వారా తెలియచేస్తుంది
రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసే ఈ సాధారణ సమాచారం, గణాంకాలు www.rbi.org.in వెబ్ సైట్ లో లభ్యమౌతాయి.
రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇంతకుముందే లభ్యమవుతున్న సమాచారం వివరాలు
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించే విధాన ప్రకటనలు
ద్రవ్య /స్థూల ఆర్థిక సంబంధిత విషయాల్లో పరిణామాల్ని అంచనా వేసి, ఎప్పటికప్పుడు నిర్మాణాత్మకమైన, వివేకమైన చర్యలు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించే విధాన ప్రకటనలు ఆధారమౌతాయి.2004 సం. వరకు వార్షిక విధాన ప్రకటనలు ప్రతి సంవత్సరం ఏప్రిల్/మే నెలల్లో ప్రకటించబడి అక్టోబర్/నవంబర్ నెలల్లో మధ్యంతర సమీక్ష జరిగేది. అయితే, ద్రవ్య విధానాల పై, ప్రగతిశీల విధానాల పై విశేషమైన దృష్టి సారించడానికి వీలుగా, ఏప్రిల్ 2005 నుంచి వార్షిక విధాన ప్రకటనలు సమర్పించే పద్ధతి మార్చబడింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు రెండు భాగాలుగా ఉంటాయి. మొదటి భాగం - ద్రవ్య విధాన వార్షిక నివేదిక; రెండో భాగం - ప్రగతిశీల మరియు నియంత్రణా విధానాల వార్షిక నివేదిక. ఇంతకు ముందులాగే, అక్టొబర్ నెలలో వార్షిక విధాన ప్రతిపాదనల సమీక్ష జరుగుతుంది. అయితే, ఈ సమీక్ష ఇప్పుడు రెండు భాగాలపైనా జరుగుతుంది, ఇంకా, నివేదిక మొదటి భాగం పై తొలి త్రైమాసిక సమీక్ష ప్రతీ సంవత్సరం జులై లోనూ, మూడో త్రైమాసిక సమీక్ష జనవరి లోనూ జరుగుతాయి. ద్రవ్య విధానం పై త్రైమాసిక సమీక్షల వల్ల మార్కెట్లతొ తరుచుగా సంబంధాలు కలిగి ఉంటూనే, పరివర్తన చెందుతున్న పరిస్థితుల్నిబట్టి నిర్దిష్టమైన చర్యలు తీసుకొవడానికి అవకాశం ఉంటుంది
వార్షిక ప్రచురణలు ( Annual Publications)
వార్షిక నివేదిక ( Annual Report )
ప్రతి సంవత్సరం ఆగస్ట్ చివరలో విడుదల చేయబడే రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక అతి ముఖ్యమైన ప్రచురణ. దేశ ఆర్థిక వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ పనితీరు, రిజర్వ్ బ్యాంక్ బ్యాలన్స్ షీట్ మీద, బోర్డ్ అఫ్ డైరెక్టర్లు సమర్పించే నివేదిక. దేశ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, ఆశలు కూడ ఇందులొ ప్రతిపాదించబడతాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరానికి (జులై - జూన్) సంబంధించి, చట్టపరమైన ఈ వార్షిక నివేదిక, ఆగస్ట్ లో విడుదల చేయబడుతుంది .
బ్యాంకింగ్ రంగ పోకడలు, వికాసం పై నివేదిక ( Report on Trend and Progress of Banking in India)
ఇది కూడా చట్టరీత్యా సమర్పించవలసిన నివేదిక. ప్రతి సంవత్సరం నవంబర్/డిసెంబర్ లో ప్రచురించబడే ఈ నివేదిక, గత సంవత్సరంలో (ఏప్రిల్ - మార్చ్) ఆర్థిక రంగ విధానాలు, పనితీరు పై విశ్లేషణ కలిగి ఉంటుంది.
ద్రవ్య, విత్త విధానాలపై నివేదిక ( Report on Currency and Finance)
ఈ వార్షిక ప్రచురణ బ్యాంక్ ఉద్యోగులచే సమర్పించ బడుతుంది. 1998-99 నుంచి దీనిలో ఒక ప్రత్యేక విషయం మీద విస్తారమైన విశ్లేషణ ఉంటూవస్తోంది. విధానపరమైన అంశాలు, దేశం ఎదుర్కుంటున్న సమస్యలు, సవాళ్ళు దీనిలో ముఖ్యాంశాలు అయినప్పటికీ, వివిధ అధ్యాయాల్లో, ఇటీవల సిద్ధాంతపరంగా, దేశవ్యాప్తంగా గమనించిన ప్రమాణాలతొ, పై పరిణామాల పరిశీలన ఉంటుంది. దాదాపు డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది కాబట్టి ఈ నివేదిక ఆర్థిక వ్యవస్థ పై మధ్యంతర సమీక్షగా పనికివస్తుంది.
భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాల కరదీపిక ( Handbook of Statistics on the Indian Economy)
ఇది సమాచార ప్రచారానికి ప్రధాన సాధనం. ఉపయోగకరమైన గణాంక సమాచారం మొత్తం ఒకేచోట లభ్యమయేలా చేయడం దీని ముఖ్యోద్దేశం. దీనిలో జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ధరలు, ద్రవ్యం, బ్యాంకింగ్, ఆర్థిక మార్కెట్లు, పబ్లిక్ ఫైనాన్స్, వాణిజ్యం, చెల్లింపుల శేషం (balance of payments) మొదలైన ఎన్నొ ఆర్థిక అంశాల వివరాలు, ప్రతి సంవత్సర. త్రైమాసిక, నెల, పక్షం, రోజు వ్యవధుల్లో ఇవ్వబడతాయి. ఈ ప్రచురణ పుస్తక రూపంలోనేగాక సి డి రామ్ పై కూడా లభిస్తుంది.
ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్ర గణాంకాలు (Database on Indian Economy)
భారత ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్, విత్త వ్యవస్థలకు సంబంధించిన ఎన్నో అంశాలపై, నిర్ణీత కాలాల్లో ప్రచురించే వివరాలు బ్యాంక్ వెబ్ సైట్ లొ ఉంటాయి. ఈ సైట్ నుంచి సమాచారం తీసుకొని పరిశోధనలకు ఉపయోగించుకోవచ్చు.
రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు (State Finances)
ఈ ప్రచురణలో ప్రతి రాష్ట్ర బజెట్ మీద సమగ్రమైన అధ్యయనం, విశ్లేషణతో కూడిన అంచనాలు ఉంటాయి. విధానాల ప్రభావం అవగాహన కోసం అన్ని రాష్ట్రాల సమగ్రమైన వివరాల విశ్లేషణ కూడా ఉంటుంది.
భారతీయ బ్యాంకుల గణాంక పట్టికలు (Statistical Tables relating to Banks in India)
ఈ వార్షిక ప్రచురణ, వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన సమగ్రమైన సమాచారం కలిగి ఉంటుంది. భారతీయ, విదేశీ వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్ షీట్ వివరాలు, వాటి సమర్థతా సూచీలు, బ్యాంక్ సమూహ వారీగా, రాష్ట్రవారీగా ఈ సమచారం ఇవ్వబడుతుంది.
మూల గణాంక వివరణ పట్టికలు (Basic Statistical Returns)
ఇది మరో వార్షిక గణాంక వివరాల ప్రచురణ. దీనిలో వాణిజ్య బ్యాంకుల కార్యాలయాల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య, డెపోజిట్లు/రుణాల వివరాలు లభిస్తాయి. ప్రాంత, రాష్ట్ర, జిల్లాలవారీగా ప్రజలకు సమాచారం ఇవ్వడం ఈ ప్రచురణ విశేషత.
త్రైమాసిక ప్రచురణలు
స్థూల ఆర్థిక, ద్రవ్య పరిణామాలు (Macroeconomic and Monetary Developments)
ఆర్ బి ఐ గవర్నర్ వార్షిక విధాన ప్రకటనకు, మధ్యంతర సమీక్షలకు ఒక రోజు ముందు విదుదలయ్యే ఈ ప్రచురణ లో, సమీక్షాకాలంలో చొటుచేసుకున్న స్థూల ఆర్థిక, ద్రవ్య పరిణామాల గురించి సమాచారం, వాటిపై సాంకేతిక విశ్లేషణ లభిస్తుంది. 2004 వరకు వార్షిక విధాన ప్రకటనతోబాటు సంవత్సరానికి ఒకమాటే విడుదలచేయబడిన ఈప్రచురణ, 2005 నుంచి వార్షిక విధాన ప్రకటన, త్రైమాసిక సమీక్షలకు ఒకరోజు ముందుగా, మూడు నెలలకి ఒక సారి ప్రచురించబడుతోంది.
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల డెపోజిట్లు/రుణాల త్రైమాసిక గణాంకాలు (Quarterly Statistics on Deposits and Credit of Scheduled Commercial Banks)
గణాంకాలు ప్రాధాన్యంగా కలిగిన ఈ ప్రచురణ, ప్రతి త్రైమాసికంలో, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల డెపోజిట్లు/రుణాల వివరాలు అందిస్తుంది. బ్యాంక్ రిటర్నుల నుంచి సంగ్రహించిన ఈ వివరాలు కేంద్ర వారీగ, రాష్ట్రవారీగా, జనాభావర్గ వారీగా, బ్యాంక్ వర్గ వారీగా సమర్పించబడుతాయి.
మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాంతాల్లో లభ్యమౌతుంది.
మాసవారీ ప్రచురణలు
ఆర్ బి ఐ బులెటిన్ (RBI Bulletin)
ప్రతి నెల మొదటి వారంలొ విడుదలచేయబడుతుంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా సేకరించిన సమాచారం ఆధారంగా వ్రాయబడ్డ విశ్లేషణాత్మక వ్యాసాలు ఉంటాయి. గవర్నర్, డిప్యూటీ గవర్నర్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఉపన్యాసాలు దీనిలో ప్రచురించబడతాయి. ఈ ఉపన్యాసాలు, కేంద్రీయ బ్యాంక్ విధానాల్ని మెరుగ్గా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడతాయి. బ్యాంక్ విడుదలచేసిన పత్రికా ప్రకటనలు, వివిధ విభాగాలు జారీ చేసిన సర్క్యులర్స్, ఆర్థిక, విత్త, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన సమాచారం ఇందులోని ఇతర ముఖ్యాంశాలు. తరుచుగా, రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక, భారతీయ బ్యాంకుల తీరుతెన్నులు/ ప్రగతిపై నివేదిక, ఇతర ముఖ్యమైన నివేదికలు ఈ ప్రచురణకు అనుబంధ సంచికలుగా జారీ చేయబడతాయి.
ద్రవ్య, పరపతి సమాచార సమీక్ష (Monetary and credit Information Review)
కార్య నిర్వహణాధికార స్థాయి లో ఉన్న బ్యాంకర్లకు ఉద్దేశించబడిన ఈ నాలుగు పేజీల పత్రిక, కేంద్రీయ బ్యాంక్ ఆ నెలలో జారీ చేసిన ముఖ్యమైన సర్క్యులర్ల వివరాలను సంక్షిప్తంగా వివరిస్తుంది. ప్రతి నెలా 1 -5 తారీకుల మధ్య వెలువడుతుంది.
వార ప్రచురణలు
ఆర్ బి ఐ బులెటిన్ కు వారాంతపు గణాంక అనుబంధం (Weekly Statistical Supplement to the RBI Bulletin)
ద్రవ్య మార్కెట్ కార్యకలాపాల వివరాలను, ప్రధాన కరెన్సీలయైన యు. ఎస్ డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, జాపనీస్ యెన్ ల రెఫరెన్స్ రేట్లను, రిజర్వ్ బ్యాంక్ ప్రతిరోజూ పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేస్తుంది. ఇంతేగాక, ప్రజలకు ఆసక్తి ఉండే ఇతర విషయాలు, ఉదాహరణకు; ముఖ్యమైన బ్యాంకింగ్ నిబంధనలు, క్రొత్త కరెన్సీ నోట్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల యోగ్యతా పత్రాల రద్దు లేక నిరాకరణ, నగర సహకార బ్యాంకుల స్థితిగతులు మొదలైన అంశాలపై కూడా ప్రకటనలు విడుదల చేస్తుంది.
రోజువారీ సమాచారం
పత్రికా ప్రకటనలు (Press Releases)
ద్రవ్య మార్కెట్ కార్యకలాపాల వివరాలను, ప్రధాన కరెన్సీలయైన యు. ఎస్ డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, జాపనీస్ యెన్ ల రెఫరెన్స్ రేట్లను, రిజర్వ్ బ్యాంక్ ప్రతిరోజూ పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేస్తుంది. ఇంతేగాక, ప్రజలకు ఆసక్తి ఉండే ఇతర విషయాలు, ఉదాహరణకు; ముఖ్యమైన బ్యాంకింగ్ నిబంధనలు, క్రొత్త కరెన్సీ నోట్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల యోగ్యతా పత్రాల రద్దు లేక నిరాకరణ, నగర సహకార బ్యాంకుల స్థితిగతులు మొదలైన అంశాలపై కూడా ప్రకటనలు విడుదల చేస్తుంది.
అప్పుడప్పుడు ప్రచురించబడే పత్రాలు (Occasional Papers)
నాలుగు నెలలకొకసారి ప్రచురించబడే ఈ పత్రాలు, నిపుణులైన ఉద్యోగులచే రచించబడి వారి దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంటాయి. 1999 నుంచి, ఈ పత్రాలు ఏడాదికి మూడుసార్లు ప్రచురితమౌతున్నాయి.
డి ఆర్ జి అధ్యయనాలు ( D R G Studies)
ఇవి బయటి నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ లోని నిపుణులు సమిష్టిగా రచించిన పరిశోధనా పత్రాలు. డెవెలప్‌మెంటల్ రిసెర్చ్ గ్రూప్ (డి ఆర్ జి), అంతర్గత పరిశోధనల్లో బయటివారి ప్రావీణ్యాన్ని సంస్థాగతంగా మేళవించడానికి అనువుగా ఏర్పరిచిన వేదిక.
నివేదికలు (Reports)
సమాచార విస్తృత వ్యాప్తికి, రిజర్వ్ బ్యాంక్, తాము ప్రతిస్పందన కోసం స్థాపించిన వివిధ సంఘాల నివేదికల్ని కూడా ప్రచురిస్తుంది.
కరపత్రాలు (Brochures)
సామాన్య ప్రజలకు లభ్యమయే వసతులగురించి, ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన సమాచారాన్ని వారికి తెలిపేందుకు, రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడు కరపత్రాలు ప్రచురిస్తుంది,
ఉపన్యాసాలు (Lectures)
రిజర్వ్ బ్యాంక్ మూడు వార్షిక ఉపన్యాసాలు ఏర్పాటు చేసింది. ఇందులొ రెండు, మాజీ గవర్నర్ల స్మారకార్థం, మరొకటి, ఒక ప్రముఖ ద్రవ్య ఆర్థికవేత్త పేరిట.
ఆర్ బి ఐ వెబ్‌సైట్
ఆర్ బి ఐ ఒక చైతన్యవంతమైన వెబ్‌సైట్ నిర్వహిస్తుంది (URL:http://www.rbi.org.in). ఆర్ బి ఐ విడుదలచేసే పూర్తి సమాచారం ఇందులో పి డి ఎఫ్, వర్డ్ ఫార్మేట్ (PDF, Word format) లో లభ్యమౌతుంది. గణాంకాలు ఎక్సెల్ ఫార్మేట్ లో (excel format) ఉంటాయి.
ఈ సైట్ రొజులో అనేకమార్లు అప్‌డేట్ చేయబడుతుంది.
నిర్ణయవిధాన ప్రక్రియలో అధిక పారదర్శకత్వం తెచ్చే లక్ష్యంతో, రిజర్వ్ బ్యాంక్ మరింత సమాచారాన్ని ప్రజలకు అందించడానికి కట్టుబడి ఉంది.
సమాచారం వెల్లడిచేసే విధానం (Disclosure Policy)
వెల్లడించిన సమాచార వివరాలు (Disclosure Log)
సమాచార హక్కు చట్టం 2005 కింద అభ్యర్థనలకు జవాబుగా విడుదల చేసిన సమస్త సమాచారాన్ని, అది సామాన్య ప్రజలకు కూడా ఉపయోగిస్తుంది అనిపిస్తే, దాన్ని ఆర్ బి ఐ, తమ వెబ్‌సైట్ లో ఉంచుతుంది. ఈ డిస్క్లోషర్ లాగ్ లో వాటి వివరాలు ఇవ్వబడతాయి.
మీ సలహాలు
రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం విడుదల చేస్తున్న సమాచారంగాక అదనంగా ఏదైనా సమాచారం అవసరమని మీరు భావిస్తే, మీ సలహాల్ని మాకు ఇ-మైల్ ద్వారా పంపండి. అయితే మీకు ఏదైన నిర్దిష్ట సమాచారం తాత్కాలిక ప్రాతిపదికన కావాలంటే, సమాచార హక్కు చట్టం 2005 కింద దరఖాస్తు చేయవచ్చు. ఇక్కడ ఒక విషయం నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సదుపాయం కేవలం సమాచారాన్ని పొందడానికేగాని, ఫిర్యాదులు చేయడానికి కాదు. బ్యాంకుల మీదా, తమ సొంత విభాగాల మీదా ఫిర్యాదుల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ లో వేరొక యంత్రాంగం ఉంది.
బ్యాంకింగ్ సేవల గురించి ఫిర్యాదులు
బ్యాంకింగ్ సేవల గురించి ఏమైనా ఫిర్యాదులు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ మరో మార్గం కల్పించింది. మీకు ఏ బ్యాంక్ కార్యాలయం/శాఖ మీద ఫిర్యాదు చేయవలసివస్తే ఆ బ్యాంక్ నోడల్ అధికారిని కలవండి. ఆయన జవాబు అసంతృప్తికరంగా ఉంటే, మీరు ఆ రాష్ట్ర బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ కు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుల ఫిర్యాదుల్ని త్వరితంగానూ, కనీస ఖర్చుతోనూ పరిష్కరించడానికి, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ వ్యవస్థను నెలకొల్పింది. బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ ప్రణాళిక గురించి మరిన్ని వివరాలకు, వారి ఫోన్ నంబర్లకు, వెబ్ సైట్ -
http://www.rbi.org.in/scripts/AboutUsDisplay.aspx?pg=Ombudsmen.htm, దర్శించండి.
రిజర్వ్ బ్యాంక్ సేవల గురించి ఫిర్యాదులు
ఒకవేళ ఏదైన రిజర్వ్ బ్యాంక్ విభాగం సేవలు అసంతృప్తికరంగా ఉంటే మీరు సంబంధిత ప్రాంతీయ కార్యాలయంలోని ఫిర్యాదుల పరిష్కార విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. వివరాలకు దయచేసి వెబ్‌సైట్:
http://www.rbi.org.in/scripts/Regional Offices.aspx లోని ’ప్రాంతీయ కార్యాలయాలు’ భాగాన్ని దర్శించండి.
సమాచార హక్కు చట్టం 2005 కింద దరఖాస్తు చేయడం ఎలా?
భారత దేశ పౌరులు, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం కావలసిన సమాచారాన్ని స్పష్టంగా కోరుతూ, లిఖితపూర్వకంగా అభ్యర్థించాలి. మరిన్ని వివరాలు, సమాచారం కోరేందుకు వీలుగా, దరఖాస్తులో వారి తపాలా చిరునామా, ఫొన్ నంబరు, ఫ్యాక్స్ నంబరు, ఇ-మైల్ అడ్రెస్ ఇవ్వాలి. ఈ చట్టప్రకారం, సమాచారం భారత పౌరులకే లభిస్తుందిగాబట్టి, మీ పౌరహోదా తెలపడం తప్పనిసరి.
నా దరఖాస్తు ఎలా పంపాలి?
భారత ప్రభుత్వం నిర్దేశించిన సమాచార హక్కు (రుసుము, మూల్యం నిబంధనలు) నియమావళి, 2005 సెక్షన్ 6(1) ప్రకారం, సమాచారం కోసం చేసే అభ్యర్ధనలతోపాటు రూ.10/- దరఖాస్తు రుసుము నగదు (రసీదు పొంది), లేదా అకౌంట్స్ అధికారి పేర డి డి, లేక బ్యాంకర్స్ చెక్ ద్వారా చెల్లించాలి.
మీ అభ్యర్ధనను పోస్ట్ ద్వారా పంపి, దానితో రూ. 10/- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర, డి డి లేక బ్యాంకర్స్ చెక్, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా పంపవచ్చు. అభ్యర్ధనతో పాటు నగదు రుసుము కూడా చెల్లించవచ్చు. దరఖాస్తు ఫ్యాక్స్, ఇ-మైల్ ద్వారా పంపినట్లయితే, రిజర్వ్ బ్యాంక్ ఆ దరఖాస్తును అందుకున్నామని తెలుపుతూ, ఒక క్రమసంఖ్య ఇచ్చి, చెల్లించాల్సిన రుసుము, దరఖాస్తుదారునికి తెలుపుతుంది. దరఖాస్తుదారుడు ఆ క్రమసంఖ్య తెలుపుతూ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చట్టప్రకారం, రిజర్వ్ బ్యాంక్, రుసుము అందినతర్వాతే దరఖాస్తుని పరిశీలిస్తుంది.
నేను అభ్యర్ధనను ఎవరికి పంపాలి?
మీ అభ్యర్థనను ఈ కింది చిరునామాల్లో దేనికైన పంపవచ్చు.
ఎపలేట్ అథారిటీ (Appellate Authority), ప్రధాన ప్రజా సమాచార అధికారులు (CPIO), ప్రత్యామ్నాయ ప్రధాన ప్రజా సమాచార అధికారులు (Alternative CPIO)
నవంబర్ 16, 2009 నుండి సహకార హక్కు చట్టం 2005 కింద సమాచారాన్ని అందించే ప్రక్రియ వికేంద్రీకరించబడింది. కేంద్రీయ కార్యాలయంలోని వివిధ విభాగాల చీఫ్ జనరల్ మేనేజర్లు, అడ్వైజర్లు, జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్ లు, ప్రధాన ప్రజా సమాచార అధికారులుగా నిర్దేశించబడ్డారు. వీరు హాజరు లేని పక్షంలో, ఇతర విభాగాల చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, ప్రధాన ప్రజా సమాచార అధికారులుగా నిర్దేశించబడతారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎపలేట్ అథారిటీ గా నిర్దేశితులయ్యారు. సహకార హక్కు చట్టం 2005 కింద ఏ విభాగానికి సంబంధించిన అభ్యర్ధన అయినా ఈ కిందనిచ్చిన చిరునామాలకు లేదా, ఆర్ ఐ ఏ డివిషన్, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, అమర్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సర్ పి ఎమ్ రోడ్, ముంబయి - 400001 కు పంపవచ్చు.
ప్రధాన ప్రజా సమాచార అధికారుల జాబితా, వారి ఇ-మైల్ చిరునామాలు
-
ప్రధాన ప్రజా సమాచార అధికారులు, వారి విభాగాల సంక్షిప్త వివరణ
-
ప్రధాన ప్రజా సమాచార అధికారులు గా నిర్దేశించబడ్డ బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ (బి ఓ), వారి అధికార పరిధి
-
ప్రాంతీయ కార్యాలయాల్లోని ప్రత్యామ్నాయ ప్రధాన ప్రజా సమాచార అధికారులు (సి ఏ ప్ ఐ ఓ) (నోడల్ ఆఫీసర్లు)
-
వివిధ విభాగాల్లోని ప్రత్యామ్నాయ ప్రధాన ప్రజా సమాచార అధికారులు (సి ఏ ప్ ఐ ఓ) (నోడల్ ఆఫీసర్లు)
ప్రధాన ప్రజా సమాచార అధికారుల జాబితా, వారి ఇ-మైల్స్, చిరునామాలు, విభాగాల సంక్షిప్త వివరణ
కస్టమర్ సర్వీసెస్
డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
సెంట్రల్ ఆఫీస్, 1 వ ఫ్లోర్
అమర్ బిల్డింగ్,
సర్ పి ఎమ్ రోడ్
ముంబయి-400 001 |
బ్యాంకింగ్ సేవలపై, రిజర్వ్ బ్యాంక్
సేవలపై ఫిర్యాదుల పరిష్కారం;
బ్యాంకింగ్ అంబుడ్జ్‌మన్ (బి ఓ) ప్రణాళిక అమలు, బి ఓ నిర్ణయాల
పై అపీళ్ళ పరిశీలన |
శ్రీ అరుణ్ పశ్రీచా,
చీఫ్ జనరల్ మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
కమ్యూనికేషన్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
సెంట్రల్ ఆఫీస్,
12 ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
సమాచార ప్రచారం;
ఆర్థిక అక్షరాస్యత సాధనాల
అబివృద్ధి |
అల్పనా కిల్లావాలా,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్
డెవెలప్‌మెంట్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
సెంట్రల్ ఆఫీస్,
12 ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
షెడ్యూల్డ్ కమర్షియల్
బ్యాంకుల మీద నియంత్రణ
(ఆర్ ఆర్ బి లు మినహా) |
శ్రీ సుదర్శన్ సేన్,
చీఫ్ జనరల్
మేనేజర్ ఇన్ చార్జ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
బ్యాంకింగ్ సూపర్విషన్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
సెంట్రల్ ఆఫీస్,
సెంటర్ 1,
వర్ల్డ్ ట్రేడ్ సెంటర్, ముంబయి - 400 005 |
బి ఆర్ ఏక్ట్ 1949,
ఆర్ బి ఐ ఏక్ట్ 1934 ప్రకారం
షెడ్యూల్డ్ కమర్షియల్
బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై
పర్యవేక్షణ; షెడ్యూల్డ్ కమర్షియల్
బ్యాంకుల ఆడిటర్ల నియామకం; బ్యాంకుల్లో,
ఎన్ బి ఎఫ్ సి ల లో
అక్రమాల పై పర్యవేక్షణ |
శ్రీ పి ఆర్ రవి మోహన్,
చీఫ్ జనరల్
మేనేజర్ ఇన్ చార్జ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
కరెన్సీ మేనేజ్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
సెంట్రల్ ఆఫీస్, 4 ఫ్లోర్
అమర్ బిల్డింగ్,
సర్ పి ఎమ్ రోడ్
ముంబయి-400 001 |
నోట్లు, నాణేల జారీ;
కరెన్సీ నిర్వహణ |
శ్రీ బి పి విజయేంద్ర,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
ఎకనమిక్ అండ్ పాలిసీ
రిసెర్చ్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
సెంట్రల్ ఆఫీస్,
6-9 ఫ్లోర్స్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
భారత ఆర్థిక వ్యవస్థను
ప్రభావితం చేసే (దేశ,
విదేశ) సమస్యలపై అధ్యయనం, విశ్లేషణ |
శ్రీ బి ఎమ్ మిశ్రా,
ఆఫీసర్ ఇన్ చార్జ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్
అండ్ బజెటరీ కంట్రోల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
సెంట్రల్ ఆఫీస్,
2 ఫ్లోర్, మైన్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్ ముంబయి-400 001 |
బ్యాంక్ బజెట్ తయారీ;
వ్యయ నియమాల అమలు;
ప్రావిడెంట్ ఫండ్ నిర్వహణ;
గ్రాట్యుఇటీ, సూపరేన్యుఏషన్,
అంబేద్కర్ ఫండ్, సెలవు ఎన్‌కాష్‍మెంట్
ఫండుల నిర్వహణ; గృహ రుణాల
నిర్వహణ; సంస్థాగత చెల్లింపులు;
ప్రాతీయ కార్యాలయాల, వేతన గ్రహీత
యూనిట్లకు కేంద్ర స్థానం. |
శ్రీ రాజేశ్ వర్మ,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్‌మెంట్స్
అండ్ ఆపరేషన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
22 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
రిజర్వ్ బ్యాంక్ యొక్క
విదేశీ మారకద్రవ్య పెట్టుబడులు,
నిర్వహణ |
శ్రీ ఎస్ కె బాల్,
చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
గవర్నమెంట్ అండ్ బ్యాంక్
అకౌంట్స్,
ఆర్ బి ఐ సెంట్రల్ ఆఫీస్,
4 వ ఫ్లోర్, బైకల్లా ఆఫీస్ బిల్డింగ్,ముంబయి సెంట్రల్ స్టేషన్ ఎదురుగా,
ముంబయి-400 008 |
బ్యాంకులకు, ప్రభుత్వానికి బ్యాంకర్;
కేంద్ర , రాష్ట్ర ప్రజా రుణ గణనము;
బ్యాంక్ అంతర్గత ఖాతాల నిర్వహణ;
వీక్లీ స్టేట్‌మెంట్ ఆఫ్ అఫైర్స్, వార్షిక
బాలన్స్ షీటుల తయారీ |
శ్రీమతి మధుమితా
సర్కార్ దేబ్,
చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ చార్జ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్
బ్యాంక్ రెగ్యులేషన్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
1 వ ఫ్లోర్, గార్మెంట్ హౌస్
ముంబయి-400 018 |
ప్రాథమిక నగర కో ఆపరేటివ్
బ్యాంకుల, బ్యాంకింగ్ సంబంధిత
కార్యకలాపాల పై నియంత్రణ |
శ్రీమతి సుమావర్మ,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్
బ్యాంక్ సూపర్విషన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఆఫీస్,
1 వ ఫ్లోర్, గార్మెంట్ హౌస్
ముంబయి-400 018 |
ప్రాథమిక నగర కో ఆపరేటివ్
బ్యాంకుల, బ్యాంకింగ్ సంబంధిత
కార్యకలాపాల పై పర్యవేక్షణ |
శ్రీమతి మాళవిక సిన్హా
చీఫ్ జనరల్ మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనర్మేషన్
టెక్నాలజీ,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
14 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
బ్యాంక్ లో అవసరమైన
కంప్యూటరులు/నెట్‌వర్క్ సిస్టంల కొనుగోలు, నిర్వహణ;
ముఖ్యమైన ఐ టి ప్రాజెక్టుల
రూపకల్పన, అభివృద్ధి, కార్యాచరణ |
శ్రీ ఎస్ గణేశ్ కుమార్,
చీఫ్ జనరల్ మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్-బ్యాంకింగ్
రెగ్యులేషన్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్,
సెంటర్ 1, వర్ల్ద్ ట్రేడ్ సెంటర్
ముంబయి-400 005 |
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
నియంత్రణ |
మిస్ ఏ మంగళగిరి,
జనరల్ మేనేజర్ ఇన్ చార్జ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్-బ్యాంకింగ్
సూపర్విషన్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్,
సెంటర్ 1, వర్ల్ద్ ట్రేడ్ సెంటర్
ముంబయి-400 005 |
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
పర్యవేక్షణ |
మిస్ సి ఆర్ సంయుక్త,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పేమెంట్
అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
14 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
రిజర్వ్ బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు
చెక్కులద్వారా జరిపే క్లీయరింగ్
ప్రక్రియల నియంత్రణ; ఎలెక్ట్రానిక్
క్లీయరింగ్ సిస్టమ్ (ఇ సి ఎస్);
ఎలెక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఇ ఎఫ్ ట్);
ప్రభుత్వ సెక్యూరిటీల క్లీయరింగ్;
జాతీయ ఎలెక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్
(ఎన్ ఇ ఎఫ్ టి); కార్డ్ చెల్లింపులు;
మొబైల్ చెల్లింపులు; చెల్లింపు విధానాలు
నెలకొల్పడానికి ఆమోదపత్రాలు. |
శ్రీ విజయ్ చుగ్
చీఫ్ జనరల్ మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్
అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్,
సి8/9, బాంద్రా కు ర్లా కాంప్లెక్స్, బాంద్రా (ఈస్ట్)
ముంబయి-400 051 |
బ్యాంకింగ్, కార్పొరేట్, విదేశీ రంగాలపై సమాచార సేకరణ,
ప్రచారం |
డాక్టర్ ఏ కే శ్రీమణి,
ఆఫీసర్ ఇన్ చార్జ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫైనాన్సియల్ మార్కెట్స్ డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
23 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
మార్కెట్లతో సమగ్రమైన సంబంధాలద్వారా
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య వ్యవహారాల్లో
సమన్వయానికి కృషి చేస్తుంది |
శ్రీ జి మహాలింగం,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
11 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
విదేశీ మారక నిర్వహణ
చట్టం 1999 కింద, దాని ప్రకారం జారీ చేసిన
సూచనలు, నియమాలు, ఆదేశాలు ప్రకారం భారత ప్రజలకి, ప్రవాస భారతీయులకి
విదేశీ మారకద్రవ్య లావాదేవీలు
సులభతరం చేయడం |
శ్రీ బి పి కనుంగో,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
హ్యూమన్ రిసౌర్స్ మేనేజ్‌మెంట్
డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
21 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
కార్యాలయ నిర్వహణ;
నియామకాలు, స్థిరీకరణలు;
ఉద్యోగుల, అధికారుల పదోన్నతి మరియు బదిలీలు;
నిఘా, క్రమశిక్షణ, బ్యాంకు ఆస్తుల
పరిరక్షణ, మానవ వనరుల వికాసం |
శ్రీ ఏ కె సారంగి, చీఫ్ జనరల్ మేనేజర్
శ్రీ ఎమ్ నందకుమార్,
జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇన్స్పెక్షన్ డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్,
సి 7, 8 వ ఫ్లోర్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్
ముంబయి-400 051 |
అమలులొనున్న కార్యాచరణ
విధానాల సమర్థత, ప్రామాణికతల
పరిశీలనకై తనిఖీలు, నివేదికలు;
కార్యలయాలు తీసుకున్న
తదుపరి చర్యల పర్యవేక్షణ
|
శ్రీ ఎమ్ సెబాస్టియన్,
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇంటర్నల్ డెట్ మేనేజ్‌మెంట్
డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
23 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల రుణాల జారీ;
కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు,
ట్రెషరీ బిల్స్ విడుదలకు క్యాలెండర్
తయారీ; ప్రధాన డీలర్లపై నియంత్రణ |
శ్రీమతి రేఖా జి వారియర్,
చీఫ్ జనరల్ మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
లీగల్ డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
సెంటర్ 1, వర్ల్ద్ ట్రేడ్ సెంటర్
ముంబయి-400 005 |
వివిధ విభాగాలు, కార్యాలయాలు,
అనుబంధ సంస్థలనుండి
పరిశీలనకు వచ్చిన విషయాలపై
సలహాలివ్వడం |
మిస్ ఎమ్ ఆనంద్,
లీగల్ అడ్వైజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
మానిటరీ పాలిసీ
డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
24 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ద్రవ్య విధాన సూత్రీకరణ,
అమలు, పర్యవేక్షణ |
శ్రీ బి కే భోయ్
అడ్వైజర్ ఇన్ చార్జ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ప్రెమిసెస్ డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
5 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
బ్యాంక్ భవనాల నిర్మాణం,
నిర్వహణ |
శ్రీ ఎస్ వెంకటాచలం
చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ చార్జ్
|
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
రాజ్ భాషా విభాగ్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్,
గార్మెంట్ హౌస్,
డాక్టర్ ఏని బిసెంట్ రోడ్
ముంబయి- 400 018 |
రాజ భాషా విధాన అమలు
పై పర్యవేక్షణ, బ్యాంకులో
రాజ భాషా వినియోగాన్ని
ప్రోత్సహించడం |
డాక్టర్ రమాకాంత్ గుప్తా,
జనరల్ మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
రిజర్వ్ బ్యాంక్ సర్వీసెస్ బోర్డ్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్,
బైకల్లా ఆఫీస్ బిల్డింగ్
ముంబయి సెంట్రల్ స్టేషన్ ఎదురుగా
ముంబయి-400 008 |
అధికారుల నియామకం, పదోన్నతి |
శ్రీ శ్రీమోహన్ యాదవ్,
జనరల్ మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్
డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
10 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
గ్రామీణ/ ప్రాధాన్య రంగ రుణ విధాన
సూత్రీకరణ; ప్రాధాన్య రంగాలు,
ప్రభుత్వ ప్రాయోజిత పేదరిక
నిర్మూలన కార్యక్రమాలకు
రుణాలివ్వడంలో వాణిజ్య బ్యాంకుల
పనితీరు పర్యవేక్షణ;
లీడ్ బ్యాంక్ ప్రణాళిక అమలు పై
పర్యవేక్షణ; గ్రామీణ రుణ బ్యాంకులు,
రాష్ట్ర/కేంద్ర సహకార బ్యాంకుల
పై నియంత్రణ; ఆర్థిక సమీకృతానికి ప్రోత్సాహం |
శ్రీ ఏ ఉద్గట
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్
మేనేజర్
శ్రీమతి మాధవీ శర్మ
చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
సెక్రటరీస్
డిపార్ట్‌మెంట్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్
16 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
సెంట్రల్ బోర్డ్, దాని కమిటీల
సమావేశాలకు, సంబంధించిన పనులు,
రిజర్వ్ బ్యాంక్
ఆఫ్ ఇండియా ఉద్యోగుల
ప్రావిడెంట్ ఫండ్ పాలకులకు
సంబంధించిన కార్యకలాపాలు |
శ్రీమతి పార్వతి వి సుందరం
చీఫ్ జనరల్
మేనేజర్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ప్రధాన ప్రజా సమాచార అధికారులుగా నిర్దేశించబడిన బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ (బి ఓ) ల జాబితా, వారి ఇ-మైల్స్, చిరునామాలు, వారి అధికార పరిధి లో ప్రాంతాలు
శ్రీ సునిల్ టి ఎస్ నాయర్
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
లా గజ్జర్ చాంబర్స్
ఆశ్రమ్ రోడ్
అహమ్మదాబాద్-380 009 |
గుజరాత్; కేంద్ర పాలిత ప్రాంతాలైన
దాద్ర మరియు నాగర్ హవేలి; దామన్ మరియు డియు. |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
10/3/8, నృపతుంగ రోడ్
బెంగళూరు - 560 001 |
కర్నాటక |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ ఏ ఎఫ్ నక్వి,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హోషంగాబాద్ రోడ్
పోస్ట్ బాక్స్ నం. 32
భోపాల్ - 462 011 |
మధ్య ప్రదేశ్; చత్తిస్ గఢ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ బి కె మిశ్రా,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పండిత్ జవాహర్ లాల్ నెహ్రు మార్గ్
భుబనేశ్వర్ - 751 001 |
ఒడిషా |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4 వ ఫ్లోర్, సెంట్రల్ విస్టా,
సెక్టర్ 17, చండీగఢ్ - 160 017 |
హిమాచల్ ప్రదేశ్; పంజాబ్;
కేంద్ర పాలిత ప్రాంతాలైన
చండిగఢ్, పంచ్ కుల,
హర్యానా లోని యమునానగర్,
అంబాలా జిల్లాలు |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ యు చిరంజీవి,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నం. 16, రాజాజీ సాలై
చెన్నై - 600 001 |
తమిల్‌నాడు; కేంద్ర పాలిత
ప్రాంతాలైన పుదుచెర్రీ
( మాహే ప్రాంతం తప్ప)
అండమాన్, నికోబార్ దీవులు |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ ఆనంద్ ప్రకాశ్
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేషన్ రోడ్, పాన్ బజార్
గువహాతి - 781 001 |
అస్సాం; అరుణాచల్ ప్రదేశ్;
మణిపూర్; మేఘాలయ;
మిజోరం; నాగాలాండ్
మరియు త్రిపుర |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డాక్టర్ ఎన్ కృష్ణమోహన్,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6-1-56, సెక్రటేరియట్ రోడ్
సైఫాబాద్
హైదరాబద్ - 500 004 |
ఆంధ్రప్రదేశ్
మరియు
తెలంగాణ. |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ ఎన్ పి తోప్నో,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4 వ ఫ్లోర్
రాంబాగ్ సర్కిల్
టోంక్ రోడ్
జైపూర్ - 302 004 |
రాజస్తాన్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ ఏ కె నస్కర్,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎమ్ జి రోడ్, పోస్ట్ బాక్స్ నం. 82
కాన్పూర్ - 208 001 |
ఉత్తర్ ప్రదేశ్
(ఘాజియబాద్,
గౌతమ్ బుధ్ నగర్
జిల్లాలు మినహా) ; ఉత్తరాంచల్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
డాక్టర్ శ్రీమతి ఎస్ చట్టోపాధ్యాయ్,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
15, నేతాజీ సుభాస్ రోడ్
కోల్కతా - 700 001 |
ప. బెంగాల్; సిక్కిం |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీమతి ఆర్ సెబాస్టియన్,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గార్మెంట్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్
దాక్టర్ ఏని బిసెంట్ రోడ్, వర్లి,
ముంబయి - 400 018 |
మహారాష్ట్ర; గోవా |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ ఆర్ కే టాండన్,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6, సంసద్ మార్గ్
న్యూ ఢిల్లీ - 110 001 |
ఢిల్లీ; జమ్ము అండ్ కాశ్మీర్;
హర్యానా (అంబాలా, యమునా
నగర్, పంచ్ కుల జిల్లాలు
మినహా); ఉత్తర్ ప్రదేశ్ లోని
ఘాజియాబాద్, గౌతమ్ బుధ్ నగర్ జిల్లాలు |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ పాత్రిక్ బార్లా,
జనరల్ మేనేజర్
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సౌత్ గాంధి మైదాన్
పాట్నా - 800 001 |
బిహార్; ఝార్ఖండ్ |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
శ్రీ ఏ మాడసామి,
c/o రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బేకరీ జంక్షన్
తిరువనంతపురం - 695 033 |
కేరళ; కేంద్ర పాలిత
ప్రాంతాలైన లక్షాద్వీప్,
పుదుచెర్రీ (మాహే ప్రాంతం
మాత్రం) |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి |
వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యామ్నాయ ప్రధాన ప్రజా సమాచార (సి ఏ పి ఐ ఓ లు) అధికారులు (నోడల్ ఆఫీసర్లు)
అహమ్మదాబాద్ |
శ్రిమతి ఎస్ ఫూకన్,
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్
మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్
4 వ ఫ్లోర్,
గాంధీ బ్రిడ్జ్ దగ్గర
అహమ్మదాబాద్ - 380 014 |
ఫోన్; 079-2758 2584
ఫాక్స్; 079-2754 1993 |
బెంగళూరు |
శ్రీ సుబోధ్ కుమార్,
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్
మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్
10/3/8, నృపతుంగా రోడ్,
బెంగళూరు-560 001 |
ఫోన్ 080- 2218 0340
ఫాక్స్ 080-2221 0185 |
బేలాపూర్ |
శ్రీ ఎస్ కే పాబ్లే
డి జి ఎమ్ (బ్యాంకింగ్) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్లాట్ నం.3, సెక్టర్ 10,
ఎచ్ ఎచ్ నిర్మలాదేవి మార్గ్,
సి బి డి బేలాపూర్
నవి ముంబయి - 400 614 |
ఫోన్ 022- 2756 0229
ఫాక్స్ 022-2757 0015 |
భోపాల్ |
శ్రీమతి వీణ శ్రీవాస్తవ
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్
బ్యాంకింగ్
సూపర్విషన్,
హోషంగాబాద్ రోడ్
భోపాల్ - 462 011 |
ఫోన్ 0755-2552459
ఫాక్స్ 0755-2551383 |
భుబనేశ్వర్ |
శ్రీ వి రంగారావ్,
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పండిత్ జవాహర్ లాల్ నెహ్రు మార్గ్
భుబనేశ్వర్ - 751 001 |
ఫోన్ 0674-2395857
ఫాక్స్ 0674-2395911 |
డెహ్రాడున్ |
శ్రీమతి కె ఎస్ జ్యోత్స్న
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
74/1 , రాజ్‍పూర్ రోడ్
డెహ్రాడున్ - 248001 |
ఫోన్ 0135-2742009 |
చండీగఢ్ |
శ్రీ రాజేశ్ కుమార్
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇష్యూ డిపార్ట్‌మెంట్
సెంట్రల్ విస్టా
సెక్టర్ 17
చండీగఢ్ - 160 017 |
ఫోన్ 0172-2784606
ఫాక్స్ 0172-2721923 |
చత్తీస్‌గఢ్ |
శ్రీ ఆనంద్ ఉపాధ్యాయ్
ఏ జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శుభాషీష్ పరిసార్
54/949 సత్య ప్రేమ్ విహార్
మహదేవ్ ఘాట్ రోడ్
సుందర్ నగర్
రాయ్‌పూర్ - 492 013
చత్తీస్‌గఢ్ |
ఫోన్ 0771- 2242330
ఫాక్స్ 0771-2242323 |
చెన్నై |
శ్రీ ఎస్ వెంకటేశ్
డి జి ఎమ్ (అడ్మిన్) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్ డెవెలప్‌మెంట్ డిపార్ట్‍మెంట్
16, రాజాజీ సాలై
చెన్నై -600 001 |
ఫోన్ 044-2536 0823
044-2539 9203
ఫాక్స్ 044-2356 5220 |
గువహాతి |
శ్రీ జె ఎమ్ తోత్న్‌గం
డి జి ఎమ్ (అడ్మిన్) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేషన్ రోడ్
గువహాతి - 781 001 |
ఫోన్ 0361-2512804
ఫాక్స్ 0361-2540033 |
హైదరాబాద్ |
శ్రీ పి కె రౌత్,
జి ఎమ్ (అడ్మిన్) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్
మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్
6-1-56, సైఫాబాద్
హైదరాబాద్ - 500 004 |
ఫోన్ 040-2323 4612
ఫాక్స్ 040-2323 2766 |
జమ్ము |
శ్రీ జి సి తాలుక్‌దార్
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ,
హ్యూమన్ రిసౌర్స్
మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్,
రైల్ హెడ్ కాంప్లెక్స్ జమ్ము180 012 |
ఫోన్ 0191-2471188
ఫాక్స్ 0191-2470576 |
జైపూర్ |
శ్రీ వైభవ్ చతుర్వేది
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రాంబాగ్ సర్కిల్
టోంక్ రోడ్
జైపూర్ - 302 004 |
ఫోన్ 0141- 2566272
ఫాక్స్ 0141-2563016 |
కోచి |
శ్రీ సి వి జార్జ్
జి ఎమ్ (ఒ ఇన్ సి) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎర్నాకులం (నార్త్)
కోచి-682 018 |
ఫోన్ 0484-2400985
ఫాక్స్ 0484-2402715 |
కాన్పూర్ |
శ్రీ ఆర్ కమలాకణ్ణన్
జి ఎమ్
(ఎచ్ ఆర్ ఎమ్ డి) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్
మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్
మహాత్మా గాంధి రోడ్
కాన్పూర్ - 208001 |
ఫోన్ 0512-2303191
ఫాక్స్ 0512-2306105 |
కోల్కతా |
శ్రీ జి ఎన్ రథ్
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
15, ఎన్ ఎస్ రోడ్,
కోల్కతా-700 001 |
ఫోన్ 033-2262 4047
ఫాక్స్ 033- 2231 2994 |
లక్నో |
శ్రీమతి శిఖి శర్మ
జి ఎమ్ |
8-9, విపిన్ ఖాండ్ గోమ్తి నగర్
లక్నో-226010 |
ఫోన్ 0522-2304866
ఫాక్స్ 0522-2393654 |
ముంబయి రీజియనల్ ఆఫీస్ |
డాక్టర్ ఎ కె హిర్వే
సి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ముంబయి రీజియనల్ ఆఫీస్
మైన్ బిల్డింగ్
షహీద్ భగత్ సింగ్ మార్గ్
ముంబయి-400 001 |
ఫోన్ 022-2261 4652
022- 2266 0500 (ఎక్స్టెన్షన్. 3249)
ఫాక్స్ 022-2266 6144 |
నాగ్‌పూర్ |
శ్రీ వి కె నాయక్
జి ఎమ్ (ఎచ్ ఆర్ ఎమ్ డి) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్
మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్
సివిల్ లైన్స్, విధాన్ భవన్ ఎదురుగా
నాగ్‌పూర్-440 001 |
ఫోన్ 0712-2532232
ఫాక్స్ 0712-2551715 |
న్యూ ఢిల్లీ |
మిస్ ఇందిరా నాను
జి ఎమ్,
ఎచ్ ఆర్ ఎమ్ డి |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎచ్ ఆర్ ఎమ్ డి
6, పార్లమెంట్ స్ట్రీట్
న్యూ ఢిల్లీ - 110 001 |
ఫోన్ 011-2371 7554
ఫాక్స్ 011-2373 0631 |
పాట్నా |
శ్రీ రాహుల్ సిన్హా
డి జి ఎమ్,
ఎచ్ ఆర్ ఎమ్ డి |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్
మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్
సౌత్ గాంధి మైదాన్
పాట్నా-800 001 |
ఫాక్స్ 0612-2320901 |
తిరువనంతపురం |
శ్రీ వి ఆర్ ప్రవీణ్ కుమార్,
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎచ్ ఆర్ ఎమ్ డి
బేకరీ జంక్షన్
పి బి నం. 6507
తిరువనంతపురం-695033 |
ఫోన్ 0471-2323481
ఫాక్స్ 0471-2330843 |
పానాజి |
శ్రీ జైకిష్
జి ఎమ్ /ఓ ఐ సి |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్‌మెంట్
గేరా ఇంపీరియమ్ II,
7 వ ఫ్లోర్, 20 ఇ డి సి కాంప్లెక్స్
పట్టో ప్లాజా,
పానాజి-403 001 |
(ఇ పి బి ఎక్స్)
ఫోన్ 0832-2904631/32
ఫాక్స్ 0832-2970056 |
రాయ్ పూర్ |
శ్రీ ఆనంద్ ఉపాధ్యాయ్
ఏ జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శుభాషీష్ పరిసార్
54/949 సత్య ప్రేమ్ విహార్
మహదేవ్ ఘాట్ రోడ్
సుందర్ నగర్
రాయ్‌పూర్
చత్తీస్‌గఢ్- 492 013 |
ఫోన్ 0771-2242330
ఫాక్స్ 0771-2242353 |
రాంచి |
శ్రీ ప్రవీణ్ రంజన్
ఏ జి ఎమ్,
ఎచ్ ఆర్ ఎమ్ డి |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్ ఆర్ డి ఏ బిల్డింగ్
4 వ ఫ్లోర్,
ప్రగతీ సదన్
కచేరీ రోడ్
రాంచి-834001 |
ఫోన్ 0651-2210513
ఫాక్స్ 0651-2210515/11 |
సిమ్లా |
శ్రీ కాళిదాస్
ఏ జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి-478, సెక్టర్ IV
న్యూ సిమ్లా
హిమాచల్ ప్రదేశ్-171009 |
ఫోన్ 0177-2670482
ఫాక్స్ 0177-2670481 |
రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ |
శ్రీ ఎస్ వెంకటేశన్
జి ఎమ్/వైస్ ప్రిన్సిపాల్ |
రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్
359, అన్నా సాలై,
తేనాం పేట్
చెన్నై-600 018 |
ఫోన్ 044-2433 4310
ఫాక్స్ 044-2434 6905 |
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్
బ్యాంకింగ్ |
శ్రీ సుధీర్ కుమార్ ఝా
వి పి/జి ఎమ్ |
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్
బ్యాంకింగ్
యూనివర్సిటీ రోడ్
పూణె-411 016 |
ఫోన్ 020-2552 1436
ఫాక్స్ 020-2553 7089 |
వివిధ విభాగాల్లో ప్రత్యామ్నాయ ప్రధాన ప్రజా సమాచార అధికారులు (సి ఏ పి ఐ ఓ లు)
(నోడల్ ఆఫిసర్లు)
కస్టమర్ సర్వీస్
డిపార్ట్‌మెంట్ |
శ్రీ ఎస్ వి పాటిల్
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
కస్టమర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్
1 వ ఫ్లోర్,
అమర్ బిల్డింగ్,
సర్ పి ఎమ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2264 2678
ఫాక్స్ 2263 2480 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
కమ్యూనికేషన్, |
శ్రీమతి మంజులా రతన్
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
డిపార్ట్‌మెంట్ ఆఫ్
కమ్యూనికేషన్
12 ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2270 3279
ఫాక్స్ 2266 0358 |
రాజ్ భాషా విభాగ్ |
శ్రీమతి సావిత్రి సింగ్
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రాజ్ భాషా విభాగ్
గార్మెంట్ హౌస్,
డాక్టర్ ఏని బిసెంట్ రోడ్
ముంబయి- 400 018 |
ఫోన్ 24824372
2498 3356
ఫాక్స్ 2498 2077 |
సెక్రటరీస్
డిపార్ట్‌మెంట్ |
శ్రీమతి ఆర్తి సిన్హా
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెక్రటరీస్
డిపార్ట్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0788
ఫాక్స్ 2270 1034 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
కరెన్సీ మేనేజ్‌మెంట్ |
శ్రీ పి ఎమ్ లిఖార్
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
డిపార్ట్‌మెంట్ ఆఫ్
కరెన్సీ మేనేజ్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0912
ఫాక్స్ 2266 2442 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
గవర్నమెంట్ అండ్ బ్యాంక్
అకౌంట్స్ |
శ్రీమతి
మోనిషా చక్రబర్తి
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్
గవర్నమెంట్ అండ్ బ్యాంక్
అకౌంట్స్
4 వ ఫ్లోర్, బైకల్లా ఆఫీస్ బిల్డింగ్,ముంబయి సెంట్రల్ స్టేషన్ ఎదురుగా
ముంబయి-400 008 |
ఫోన్ 2308 4121
(ఎక్స్టెన్షన్ 2417)
ఫాక్స్ 2300 0370 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్‌మెంట్స్
అండ్ ఆపరేషన్స్ |
శ్రీ ఆర్ సుబ్రమనియన్
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్
ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్‌మెంట్స్
అండ్ ఆపరేషన్స్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2263 2067
ఫాక్స్ 2266 4667 |
ఫైనాన్సియల్ మార్కెట్స్ డిపార్ట్‌మెంట్ |
శ్రీ ఆనంద్ ప్రకాశ్
డైరెక్టర్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఫైనాన్సియల్ మార్కెట్స్ డిపార్ట్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0645
ఫాక్స్ 2263 4824 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పేమెంట్
అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ |
శ్రీ పంకజ్ ఎక్కా
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పేమెంట్
అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0383
ఫాక్స్ 2269 1557 |
ఇన్స్పెక్షన్ డిపార్ట్‌మెంట్ |
శ్రీ డి జి కాళె
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇన్స్పెక్షన్ డిపార్ట్‌మెంట్
సి 7, 8 వ ఫ్లోర్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్
ముంబయి-400 051 |
ఫోన్ 2657 2301
ఫాక్స్ 2657 2029 |
లీగల్ డిపార్ట్‌మెంట్ |
శ్రీ ఎ కృష్ణ గోపాల్
జాయంట్ లీగల్ అడ్వైజర్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
లీగల్ డిపార్ట్‌మెంట్
5 వ ఫ్లోర్, సెంటర్ 1,
వర్ల్ద్ ట్రేడ్ సెంటర్
ముంబయి-400 005 |
ఫోన్ 2215 3496
ఫాక్స్ 2215 3470 |
ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్‌మెంట్ |
శ్రీమతి రజని ప్రసాద్
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0618
ఫాక్స్ 2261 0623 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్
డెవెలప్‌మెంట్ |
శ్రీ అర్ ఎన్ జేనా
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
డిపార్ట్‌మెంట్ ఆఫ్
బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్
డెవెలప్‌మెంట్
వర్ల్ద్ ట్రేడ్ సెంటర్, సెంటర్ 1,
ముంబయి-400 005 |
ఫోన్ 2270 1205
ఫాక్స్ 2216 0970 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్యాంకింగ్
సూపర్విషన్ |
శ్రీమతి దివ్యా సూద్ దౌర్
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్యాంకింగ్
సూపర్విషన్
వర్ల్ద్ ట్రేడ్ సెంటర్, సెంటర్ 1,
ముంబయి-400 005 |
ఫోన్ 2261 0955
ఫాక్స్ 2261 0932 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్-బ్యాంకింగ్
సూపర్విషన్ |
శ్రీమతి ఏ మంగళగిరి
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్-బ్యాంకింగ్
సూపర్విషన్
సెంటర్ 1, వర్ల్ద్ ట్రేడ్ సెంటర్
ముంబయి-400 005 |
ఫోన్ 2216 1940
(ఎక్స్టెన్షన్ 226)
ఫాక్స్ 2215 0540 |
ఇంటర్నల్ డెట్ మేనేజ్‌మెంట్
డిపార్ట్‌మెంట్ |
డాక్టర్ (శ్రీమతి) ఎస్ సగ్గర్
డైరక్టర్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇంటర్నల్ డెట్ మేనేజ్‌మెంట్
డిపార్ట్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0680
ఫాక్స్ 2264 4158 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్
అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ |
శ్రీ స్నేహార్థి గయేన్
డైరక్టర్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్
అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్
సి 9, 6 వ ఫ్లోర్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్,
ముంబయి-400 051 |
ఫోన్ 2657 2513
ఫాక్స్ 2657 0848 |
హ్యూమన్ రిసౌర్స్ మేనేజ్‌మెంట్
డిపార్ట్‌మెంట్ |
శ్రీమతి శక్తి దూబే
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హ్యూమన్ రిసౌర్స్ మేనేజ్‌మెంట్
డిపార్ట్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2263 2366
(ఎక్స్టెన్షన్ 4103)
ఫాక్స్ 2263 2480 |
మానిటరీ పాలిసీ
డిపార్ట్‌మెంట్ |
శ్రీమతి రక్షా దేవి
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మానిటరీ పాలిసీ
డిపార్ట్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2269 2426
ఫాక్స్ 2265 1685 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్
బ్యాంక్ రెగ్యులేషన్ |
శ్రీమతి అనితా భట్టాచార్య
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్
బ్యాంక్ రెగ్యులేషన్
గార్మెంట్ హౌస్
డాక్టర్ ఏని బిసెంట్ రోడ్
ముంబయి-400 018 |
ఫోన్ 2492 0340
ఫాక్స్ 2497 4040 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్
బ్యాంక్ సూపర్విషన్ |
శ్రీమతి అనితా భట్టాచార్య
జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కో ఆపరేటివ్
బ్యాంక్ సూపర్విషన్
గార్మెంట్ హౌస్
డాక్టర్ ఏని బిసెంట్ రోడ్
ముంబయి-400 018 |
ఫోన్ 2492 0340
ఫాక్స్ 2497 4040 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనర్మేషన్
టెక్నాలజీ |
శ్రీ పి పార్థసారథి
సి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనర్మేషన్
టెక్నాలజీ
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2270 1292
ఫాక్స్ 2269 1557 |
రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్
డిపార్ట్‌మెంట్ |
శ్రీ అరిదమన్ కుమార్
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్
డిపార్ట్‌మెంట్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0923
ఫాక్స్ 2262 1011 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్
అండ్ బజెటరీ కంట్రోల్ |
శ్రీ గౌరేశ్ ఆర్ కోటియన్
డి జి ఎమ్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్
అండ్ బజెటరీ కంట్రోల్
మైన్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0486
ఫాక్స్ 2261 0535 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్
ఎకనమిక్ అండ్ పాలిసీ రిసెర్చ్ |
శ్రీ ఏ కరునాగరన్
డైరెక్టర్ |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
డిపార్ట్‌మెంట్ ఆఫ్
ఎకనమిక్ పాలిసీ అండ్ రిసెర్చ్,
డివిషన్ ఆఫ్ నాన్-బ్యాంక్
ఫైనాన్షియల్ స్టడీస్
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, ఫోర్ట్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0763
ఫాక్స్ 2263 3186 |
ప్రెమిసెస్ డిపార్ట్‌మెంట్ |
శ్రీ కౌశిక్ చక్రబర్తి
డి జి ఎమ్ (అడ్మిన్) |
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రెమిసెస్ డిపార్ట్‌మెంట్
5 వ ఫ్లోర్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‌సింగ్ రోడ్
ముంబయి-400 001 |
ఫోన్ 2261 0927
(ఇ పి ఏ బి ఎక్స్)2202)
ఫాక్స్ 2266 0807 |
సమాచారం అందించడానికి ఆర్ బి ఐ ఎంత కాలం తీసుకుంటుంది?
రుసుముతొ సహా అభ్యర్థన అందిన 30 రోజుల్లో, ఆర్ బి ఐ, అభ్యర్థి కోరిన సమాచారం ఇవ్వ వచ్చా లేదా అనేది తెలియ చేస్తుంది.
సమాచారం పొందడానికి ఏదైనా రుసుము చెల్లించాలా?
సమాచార హక్కు (రుసుము,వ్యయ నిబంధనలు) నియమావళి, 2005 ప్రకారం ఈ క్రింది విధంగా రుసుము వసూలు చేస్తారు,
- ప్రతి పేజీకి/కాపీకి (ఎ 4 లేదా ఎ 3) రూ.2/-
- పెద్ద సైజు పేపర్ మీద కావలసి వస్తే, కాపీ కి అయ్యే వాస్తవ ఖర్చు
- నమూనాలకు వాస్తవ ధర
- రికార్డుల పరిశీలనకు మొదటి గంట వరకు ఏ రుసుము ఉండదు. ఆ తర్వాత ప్రతి గంటకు (దానిలో భాగానికి) రూ.5/-
సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 7 (5) ప్రకారం సమాచారం అందించడానికి, ప్రజాధికారులు ఈ క్రింది విధంగా చార్జ్ చేస్తారు
నేను ఏ దశలో ఈ ధర చెల్లించాలి?
ఒక వేళ రిజర్వ్ బ్యాంక్ సమాచారం కలిగి ఉండి, అది వెల్లడించదగినది అయితే, మీ అభ్యర్థన (రుసుముతొబాటు) అందిన 30 రోజుల్లో సమాచార హక్కు చట్టం 7 (1) క్రింద ఆ సమాచారం పొందడానికి మీరెంత రుసుము చెల్లించాలొ తెలియ చేస్తుంది.
చెల్లించాల్సిన రుసుము ఆర్ బి ఐ కి అందిన తర్వాత మీకు సమాచారం లభిస్తుంది
సమాచారం ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ నిరాకరించవచ్చా?
సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 8, 9 ప్రకారం ఈ క్రింది పేర్కొన్నటువంటి సమాచారం వెల్లడించనక్కరలేదు
-
భారత దేశ సార్వభౌమాధికారానికీ, ఐకమత్యానికీ భగ్నం కలిగించే విషయాలు; దేశ రక్షణ, వ్యూహాత్మక, శాస్త్ర, ఆర్థిక వ్యవస్థలకు, విదేశాలతో సంబంధాలకు భంగం కలిగించే సమాచారం; నేరాలను ప్రొత్సహించే విషయాలు
-
న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్ళు బహిర్గతం చేయరాదని ఖచ్చితంగా చెప్పిన విషయాలు; లేదా సమాచారం ఇవ్వడం కోర్ట్ ధిక్కారమయే సందర్భాలు
-
పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసన సభల ప్రత్యేక హక్కులకు భంగం కలిగించే సమాచారం
-
ఒకరి పోటీ స్థితికి నష్టం కలిగించే వాణిజ్య, వ్యాపార రహస్యాలు, మేధో హక్కులకు సంబంధించిన సమాచారం. సమర్థ అధికారి (competent authority) విస్తృత ప్రజా సంక్షేమం కోసం వెల్లడించవచ్చు అని సంతృప్తిచెందితే తప్ప)
-
ధర్మకర్తృత్వ సంబంధ మూలంగా (fiduciary relationship) లభించిన సమాచారం. (సమర్థ అధికారి (competent authority) విస్తృత ప్రజా సంక్షేమం కొసం వెల్లడించవచ్చు అని సంతృప్తిచెందితే తప్ప)
-
విదేశాలనుండి లభ్యమైన రహస్య సమాచారం; సమాచారం వెల్లడించడం వల్ల ఎవరికైన ప్రాణ భయం, భౌతిక ప్రమాదం కలిగే సందర్భాలు; చట్టం అమలుకు, దేశ రక్షణకు సమాచారాన్ని అందించినవారి గోప్యతకు భంగం కలిగే సందర్భాలు
-
నేర పరిశోధన, నేర విచారణ, నేరస్థుల నిర్బంధాలకు అడ్డుపడే సమాచారం
-
కేబినెట్ పేపర్లు; మంత్రి మండలి, కార్యదర్శుల, ఇతర అధికారుల చర్చల రికార్డ్
-
ప్రజాప్రయోజనాలతో ఏ విధంగానూ సంబంధం లేని సమాచారం,వ్యక్తిగతజీవితానికిభంగంకలిగించేఅంతరంగికవిషయాలు
నాకు అపీల్ చేసుకొనే హక్కు ఉందా?
సమాచార హక్కు చట్టం 2005, ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ మీకు అందించిన సమాచారం సంతృప్తికరంగా లేకపోయినా, లేక సమాచారాన్ని ఇవ్వరాదన్న వారి నిర్ణయం పైన అపీలు చేసుకొవచ్చు.
నా అపీలు ఎవరికి పంపాలి?
మీ అపీలును ఈ కింది వారిలోఎవరికైనా పంపవచ్చు:
1) డాక్టర్ (శ్రీమతి) దీపాలి పంత్ జోషి,
(మొదటి అపెలేట్ అధికారి)
ఎక్జెక్యూటివ్ డైరెక్టర్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‍సింగ్ మార్గ్
ముంబయి - 400 001
ఇ-మైల్ పంపుటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఫోన్: 022-2261 1083
ఫాక్స్: 022-2263 2052
2) శ్రీ కె కె వోహ్రా
(ప్రత్యామ్నాయ అపెలేట్ అధికారి)
ఎక్జెక్యూటివ్ డైరెక్టర్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్
షహీద్ భగత్‍సింగ్ మార్గ్
ముంబయి - 400 001
అపెలేట్ అధికారి నిర్ణయం కూడా సంతృప్తికరంగా లేకపోతే?
రిజర్వ్ బ్యాంకులోని అపెలేట్ అధికారి నిర్ణయంతోనూ మీరు సంతృప్తి చెందకపోతే, సమాచార హక్కు చట్టం 2005, 3 వ అధ్యాయం ప్రకారం నియమించిన, కేంద్ర సమాచార కమిషనుకు అపీలు చేసుకోవచ్చు. |