29 జూన్ 2026
శ్రీ భారతి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, హైదరాబాద్ పై భారతీయ రిజర్వు
బ్యాంకు వారిచే నగదు జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు, పట్టణ సహకార బ్యాంకులలో తమ డైరెక్టర్లకు, వారి బంధువులకు మరియు వారికి లబ్ధి చేకూరే సంస్థలకు ఇచ్చే రుణాలపై విడుదల చేసిన నిబంధనలను, చిన్న విలువ గల రుణాలు పై జారీ చేయబడిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు శ్రీ భారతి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, హైదరాబాద్ (బ్యాంకు) వారిపై భారతీయ రిజర్వు బ్యాంకు జూన్ 25, 2026 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ. 1.50 లక్ష (ఒక లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.
మార్చి 31, 2025 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పర్యవేక్షణ ఆధారంగా, ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా, బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వు బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట మరియు బ్యాంకు చేసిన అదనపు సమర్పణలు పరిశీలించిన తరువాత పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఈ అభియోగం సరియైనదిగా, విధించిన నగదు జరిమానా సహేతుకమైనదిగా ఆర్బీఐ ద్వారా నిర్ధారించడమైనది.
ఈ బ్యాంకు:
-
డైరెక్టర్ సంబంధిత రుణాన్ని మంజూరు చేసింది.
- మార్చి 31, 2025 నాటికి, తమ మొత్తం రుణాలు మరియు అప్పులలో చిన్న విలువ గల రుణాలు కనీసం 40 శాతం ఉండేలా చూడటంలో విఫలమయ్యారు.
ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవీల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. అంతేగాక ఇట్టి నగదు జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకుపై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వు బ్యాంకు ఎటువంటి పక్షపాతం వహించదు.
(బ్రిజ్ రాజ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రిక ప్రకటన: 2026-2027/562 |