Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (73.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 26/04/2017
డా. పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అమ్రావతి (మహారాష్ట్ర)
పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధింపు

ఏప్రిల్ 26, 2017

డా. పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అమ్రావతి (మహారాష్ట్ర)
పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధింపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47 (A)(1)(b) మరియు సెక్షన్‌ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, డా. పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., అమ్రావతి పై, మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి (KYC) నిబంధనలు ఉల్లంఘించినందుకు, ₹ 5.0 లక్షలు (ఐదు లక్షల రూపాయిలు) నగదు జరిమానా విధించినది.

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2016-2017/2912

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….