Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (249.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 28/09/2020
పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF) – సడలింపుల యొక్క పొడిగింపు

సెప్టెంబర్ 28, 2020

పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF) – సడలింపుల యొక్క పొడిగింపు

పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF) క్రింద నిధులను పొందడానికి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (యస్ యల్ ఆర్-SLR) నిదులలోంచి యన్ డి టి యల్ (Net Demand and Time Liabilities) అదనంగా ఒక శాతం వరకు, అంటే మొత్తం యన్డిటియల్ లో మూడు (3) శాతం వరకు నిధులను వినియోగించుకోవడానికి మార్చి 27, 2020 న బ్యాంకులు అనుమతించబడినవి. కోవిడ్-19 అంతరాయాల దృష్ట్యా, ముందు జూన్ 3, 2020 వరకు అనుమతించబడిన ఈ సౌకర్యం, తేదీ జూన్ 26, 2020 నాటి ఆదేశం ద్వారా సెప్టెంబర్ 30, 2020 వరకు అనుమతించబడింది. ఈ సౌకర్యం 1.49 లక్షలకోట్ల మేరకు నిధులు అందుబాటులో ఉంచడమే గాకుండా లిక్విడిటీ కవేరేజ్ రేషియో (యల్ సీ ఆర్ – LCR) కోసం ఉన్నత-శ్రేణి ద్రవ్య ఆస్తులు (హెచ్ క్యూ యల్ ఎ – HQLA) గా అర్హత పొందుతుంది. యల్ సీ ఆర్ – LCR అవసరాల తీర్పు కొనసాగింపుకు వీలుగా బ్యాంకులకు ద్రవ్య లభ్యత అందించే ఉద్దేశ్యం తో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ-MSF సడలింపును మరో ఆరు మాసాల పాటు అనగా మార్చి 31, 2021 వరకు కొనసాగించాలని నిర్ణయించడమైనది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/401

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.