Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (85.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 11/09/2019
ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్ – రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాల ఉపసంహరణ

తేదీ: 11/09/2019

ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్ –
రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాల ఉపసంహరణ

రిజర్వ్ బ్యాంక్, సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద, జూన్‌ 04, 2014 తేదీన, ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నోకు, నిర్దేశాలు జారీచేసినది. ఈ నిర్దేశాలు ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, మార్చ్ 05, 2019 తేదీన జారీచేసిన చివరి నిర్దేశాలద్వారా, సెప్టెంబర్ 11, 2019 వరకు పొడిగించబడినవి.

రిజర్వ్ బ్యాంక్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్దేశాలను ఉపసంహరించుట అవసరమని భావించి, సెక్షన్‌ 35A, సబ్-సెక్షన్‌ (2), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) తమకు దఖలుపరచిన అధికారాలతో, ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి, లక్నో, ఉత్తర్ ప్రదేశ్‌కు జారీచేయబడి, తదుపరి మార్చబడుతూవచ్చిన నిర్దేశాలను, ఇందుమూలముగా ఉపసంహరించినది.

ఈ సందర్భంగా జారీచేసిన ఆదేశాల నకలు, ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో, ప్రజల సమాచారంకొరకు ప్రదర్శింపబడినది. ఇకనుంచి, బ్యాంకు అన్ని బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగిస్తుంది.

యోగేశ్ దయాల్  
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/669

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.