Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (78.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 02/08/2017
తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణా - జరిమానా విధింపు

తేదీ: ఆగస్ట్ 02, 2017

తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణా -
జరిమానా విధింపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47 (A)(1)(b) మరియు సెక్షన్‌ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, తిరుమల అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణాపై, 2.00 లక్షల (కేవలం రెండు లక్షల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. ఈ క్రింది విషయాలలో, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, మార్గదర్శకాలూ ఉల్లంఘించినం దున ఈ జరిమానా విధించబడింది:

  1. డైరెక్టర్లకు, వారి బంధువులకు అప్పులు, బయానాలు

  2. ఎక్స్పోజర్ నియమాలూ, చట్టబద్ధ/ఇతర నిబంధనలు

  3. అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల లాభాల నుండి ప్రజా/ధార్మిక ప్రయోజనాలకు చందాలు/విరాళాలు

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చి, దానిపై మౌఖిక వినతులుకూడా చేసినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/331

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.