Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (76.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 01/10/2016
బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ యాక్ట్, 1949 (AACS) సెక్ష‌న్ 35 A లోని సూచ‌న‌ల కొన‌సాగింపు అజింక్య‌తార స‌హ‌కారి బ్యాంక్ లిమిటెడ్‌, స‌తారా, మ‌హారాష్ట్ర‌

అక్టోబ‌ర్ 01, 2016

బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ యాక్ట్, 1949 (AACS) సెక్ష‌న్ 35 A లోని సూచ‌న‌ల కొన‌సాగింపు
అజింక్య‌తార స‌హ‌కారి బ్యాంక్ లిమిటెడ్‌, స‌తారా, మ‌హారాష్ట్ర‌

మహారాష్ట్రలోని సతారాకు చెందిన అజింక్యతార సహకారి బ్యాంక్ లిమిటెడ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35 A కింద సెప్టెంబ‌ర్ 28, 2015న జారీ చేసిన డైరెక్టివ్ నెం. DCBS.CO BSD-1No. D-19/12.22.328/2015-16 ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 30, 2015 వ్యాపార లావాదేవీలు ముగిసిన‌ప్ప‌టి నుండి ఆరు నెల‌ల పాటు ఉత్త‌ర్వుల క్రింద ఉంచ‌డం జ‌రిగింది. పైన పేర్కొన్న ఉత్త‌రువుల‌ను మేము మార్చి 29, 2016న విడుద‌ల చేసిన ఉత్త‌రువుల‌ ప్ర‌కారం మ‌రో ఆరు నెల‌ల పాటు పొడిగించ‌డం జ‌రిగింది. అందువ‌ల్ల ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం ఏమ‌న‌గా, సెప్టెంబ‌ర్ 28, 2016న విడుద‌ల చేసిన‌ స‌వ‌రించిన డైరెక్టివ్ నెం. DCBR.CO.AID/D-08/12.22.328/2015-16 ప్ర‌కారం అజింక్యతార సహకారి బ్యాంక్ లిమిటెడ్, స‌తారాకు పైన పేర్కొన్న సెప్టెంబ‌ర్28, 2015న జారీ చేసిన ఉత్త‌రువు‌, దానితో పాటు మార్చి 29, 2016న విడుద‌ల చేసిన ఉత్త‌రువులు మ‌రో ఆరు నెల‌ల పాటు అన‌గా, మార్చి 30, 2017 వ‌ర‌కు, స‌మీక్ష‌కు లోబ‌డి, కొన‌సాగుతాయ‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డ‌మైన‌ది. పైన పేర్కొన్న ఉత్త‌రువుల‌కు చెందిన నియ‌మ నిబంధ‌న‌లలో ఎలాంటి మార్పూ ఉండ‌దు. ప్ర‌జ‌ల ప‌రిశీల‌నార్థం సెప్టెంబ‌ర్ 28, 2016న జారీ చేయ‌బ‌డిన ఆ ఉత్త‌రువుల కాపీని బ్యాంకు ప‌రిస‌రాల‌లో ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రుగుతుంది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు చేసిన ఆ మార్పును అనుస‌రించి ఆ బ్యాంకు యొక్క ఆర్థిక ప‌రిస్థితి చెప్పుకోద‌గినంత‌గా మెరుగుప‌డింద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందింద‌ని భావిస్తున్న‌ట్లుగా ప‌రిగ‌ణించ‌రాదు.

అజిత్ ప్ర‌సాద్‌,
స‌హాయ స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్ : 2016-17/829

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.