Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (70.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 02/11/2016
ఐటీ బకాయిల‌ను RBI లేదా అధీకృత బ్యాంకు శాఖ‌ల‌లో ముంద‌స్తుగా చెల్లించండి - డిసెంబ‌ర్ 2016

నవంబర్ 02, 2016

ఐటీ బకాయిల‌ను RBI లేదా అధీకృత బ్యాంకు శాఖ‌ల‌లో
ముంద‌స్తుగా చెల్లించండి - డిసెంబ‌ర్ 2016

ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేవారు గ‌డువుకు త‌గినంత ముందుగానే త‌మ ఆదాయ ప‌న్ను బ‌కాయీల‌ను చెల్లించ‌మ‌ని RBI విజ్ఞ‌ప్తి చేసింది. అంతే కాకుండా ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేవారు ఏజెన్సీ బ్యాంకుల ప్ర‌త్యేక శాఖ‌లు లేదా ఆ బ్యాంకులు అందిస్తున్న ఆన్ లైన్ చెల్లింపుల సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌డం లాంటి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల వారు రిజ‌ర్వ్ బ్యాంక్ కార్యాల‌యాల వ‌ద్ద పొడ‌వైన క్యూల‌లో నిల‌బ‌డే అసౌక‌ర్యం త‌గ్గుతుంది.

ప్ర‌తి సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ నెల చివ‌రి వారంలో భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ ద్వారా ఆదాయ ప‌న్ను బ‌కాయీల‌ను చెల్లించ‌డానికి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రావ‌డం జ‌రుగుతోంద‌ని గ‌మ‌నించ‌డం జ‌రిగింది. ఇందుకోసం రిజ‌ర్వ్ బ్యాంక్ అద‌న‌పు కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ రిసీప్ట్ ల‌ను జారీ చేయ‌డంలో తీవ్ర వ‌త్తిడిని ఎదుర్కొంటోంది. చాలా బ్యాంకులు ఆన్ లైన్ లో ఆదాయ ప‌న్నును చెల్లించే వెసులుబాటు కూడా క‌ల్పిస్తున్నాయి.

ఇర‌వై తొమ్మిది ఏజెన్సీ బ్యాంకులు ఆదాయ ప‌న్ను బ‌కాయీ చెల్లింపులు స్వీక‌రించ‌డానికి అధికారాన్ని క‌లిగి ఉన్నాయి. అవి:

1. అల‌హాబాద్ బ్యాంక్‌
2. ఆంధ్రా బ్యాంక్‌
3. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా
4. బ్యాంక్ ఆఫ్ ఇండియా
5. బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర
6. కెన‌రా బ్యాంక్
7. సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8. కార్పొరేష‌న్ బ్యాంక్
9. దేనా బ్యాంక్
10. IDBI బ్యాంక్
11. ఇండియ‌న్ బ్యాంక్
12. ఇండియ‌న్ ఓవ‌ర్ సీస్ బ్యాంక్
13. ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్
14 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
15. పంజాబ్ నేష‌నల్ బ్యాంక్
16. సిండికేట్ బ్యాంక్
17. యూకో బ్యాంక్
18. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
19. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
20. విజ‌యా బ్యాంక్
21. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
22. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బిక‌నేర్ అండ్ జైపూర్‌
23. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్‌
24. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్‌
25. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌
26. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ప‌టియాలా
27. HDFC బ్యాంక్ లిమిటెడ్‌
28. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్‌
29. ICICI బ్యాంక్ లిమిటెడ్

అజిత్ ప్ర‌సాద్‌
స‌హాయ స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్ : 2016-17/1087

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.