Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x���[��sV >> �|ms�qs Lji�d�����qs - Display
Note : To obtain an aligned printout please download the (307.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 08/11/2016
రూ.2000 నోట్ల జారీ

నవంబ‌ర్ 08. 2016

రూ.2000 నోట్ల జారీ

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ త్వ‌ర‌లో మ‌హాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ.2000 మూల్య‌వ‌ర్గంలో ఇన్ సెట్ లెట‌ర్ లేకుండా, నోటు వెనుక‌భాగంపై రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ఆర్ ప‌టేల్ సంత‌కం, నోటును ముద్రించిన సంవ‌త్స‌రం 2016 అని ముద్రించిన‌ కొత్త డిజైన్‌లో ఉన్ననోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. ఈ కొత్త నోట్ల వెనుక భాగంలో గ్ర‌హాంత‌రాల‌లోకి భార‌తదేశం మొట్ట‌మొద‌టి సారిగా ప్ర‌వేశ‌పెట్టిన మంగ‌ళ‌యాన్ ఉప‌గ్ర‌హం చిత్రం ఉంటుంది. ఈ నోటు గాఢ‌మైన గులాబీ రంగులో ఉంటుంది. ఈ నోటు ముందు భాగం మ‌రియు వెనుక భాగంలో ఇత‌ర రంగుల‌తో క‌లిసిపోయేట్లుగా రూపొందించిన‌ ప‌లు డిజైన్లు, జామెట్రిక్ ఆకృతులూ ఉంటాయి.


కొత్త రూ.2000 నోటులోని ముఖ్య విశేషాలు

ముందు భాగం

1. 2000 అన్న మూల్య‌వ‌ర్గ‌పు సంఖ్యతో కూడిన‌ సీ త్రూ రిజిస్ట‌ర్‌.
2. మూల్య‌వ‌ర్గంలో 2000 అన్న బ‌య‌ట‌కు క‌నిపించ‌ని సంఖ్య‌.
3. దేవ‌నాగరి లిపిలో 2000 అన్న సంఖ్య‌.
4. నోటు మ‌ధ్య భాగంలో మ‌హాత్మా గాంధీ చిత్రం
5. బ్యాంకు నోటు ఎడ‌మ వైపున‌ ‘RBI’ మ‌రియు ‘2000’ అన్న సూక్ష్మ అక్ష‌రాలు
6. రంగు మారే ఏర్పాటు క‌లిగిన‌ భార‌త్-RBI మ‌రియు 2000 అన్న అక్ష‌రాలున్న ర‌క్ష‌ణ‌ప‌ర‌మైన దార‌పుపోగు. నోటును వంచి చూసిన‌పుడు దార‌పుపోగు రంగు నీలం నుంచి ఆకుప‌చ్చ రంగులోనికి మారుతుంది.
7. జ‌వాబుదారీ ష‌ర‌తు, గ‌వ‌ర్న‌ర్ సంత‌కంతో కూడిన వాగ్దాన ష‌ర‌తు మ‌రియు కుడివైపున RBI ఎంబ్ల‌మ్.
8.కింది వైపు కుడి భాగంలో రంగు మారే ఇంక్‌తో (ఆకుప‌చ్చ నుంచి నీలం రంగులోకి) రూపాయి గుర్తు క‌లిగిన మూల్య‌వ‌ర్గ‌పు సంఖ్య‌ - రూ.2000.
9. కుడి వైపున అశోక స్తంభం గుర్తు
10. పై ఎడ‌మ భాగం మ‌రియు కింది వైపు కుడి భాగంలో ఆరోహ‌ణ క్ర‌మంలోని సంఖ్య‌ల నెంబ‌ర్ ప్యాన‌ల్‌.

దృష్టి లోపం క‌లిగిన వారికి :

* ఇంటాలియో లేదా ఉబ్బెత్తుగా ఉండే మ‌హాత్మా గాంధీ చిత్రం, అశోక స్తంభం గుర్తు, బ్లీడ్ లైనులు మ‌రియు గుర్తింపు చిహ్నం.

11. కుడివైపున ఉబ్బెత్తు ఉండేలా ముద్రించ‌బ‌డిన‌ రూ.2000 స‌మ‌త‌ల చ‌తుర‌స్రము.
12. ఉబ్బెత్తుగా ఉండే ముద్ర‌ణ‌లో కుడి మ‌రియు ఎడ‌మ వైపున ఏడు కోణీయ బ్లీడ్ లైన్‌లు.

వెనుక భాగం

13. నోటు ముద్రించ‌బ‌డిన సంవ‌త్సరం
14. స్వ‌చ్ఛ్ భార‌త్ గుర్తు మ‌రియు నినాదం
15. మ‌ధ్య వైపుగా భాష‌ల ప్యానెల్
16. మంగ‌ళ‌యాన్ చిత్రం
17. దేవ‌న‌గ‌రి లిపిలో 2000 అన్న మూల్య‌వ‌ర్గ‌పు సంఖ్య‌.

ఈ కొత్త నోటు 66 ఎంఎం X 166 ఎంఎం ప‌రిమాణంలో ఉంటుంది.

అల్ప‌నా కిల్లావాలా
ప్ర‌ధాన స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్ : 2016-2017/1144

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.