Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV>> ƒ¯[ÉÓÁzmnsZNP[xtsQƒ±s= - View
Note : To obtain an aligned printout please download the (72.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 30/06/2016
ప్రధాన్‌ మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY) అమలు కై నిబంధనల సవరింపు

RBI/2015-16/437
DCBR.BPD (PCB) Cir. No.20/12.05.001/2015-16

జూన్‌ 30, 2016

చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
అన్ని ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు

అమ్మా/అయ్యా,

ప్రధాన్‌ మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY) అమలు కై నిబంధనల సవరింపు

ప్రధాన్‌ మంత్రి జీవన్‌ బీమా యోజన/ ప్రధాన్‌ మంత్రి సురక్ష బీమా యోజన (PMJJY/PMSBY), విధి విధానలపై, మా సర్క్యులర్, DCBR.BPD.(PCB) Cir.No.8/12.05.001/2014-15 తేదీ, మే 5, 2015 దయచేసి చూడండి.

2. భారత ప్రభుత్వం ఈ నిబంధనలు సమీక్షించిన తరువాత, సమర్థాదికారి (Competent Authority) PMJJBY నిబంధనలలో జూన్‌ 1, 2016 నుండి, హక్కు గురించి ఒక షరతు చేర్చాలని, నిశ్చయించారు. ఈ షరతు ప్రకారం, పథకంలో చేరిన మొదటి 45 రోజుల్లో, మృత్యువు సంభవిస్తే, ఆ క్లైమ్‌ చెల్లించబడదు. మరో విధంగా చెప్పాలంటే, పథకంలో చేరిన 45 రోజుల తరువాతే జీవిత బీమా మొదలవుతుంది. అయితే, మృత్యువు ప్రమాదం కారణంగా సంభవిస్తే, ఈ షరతు వర్తించదు.

3. అన్ని ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు, పై సవరణను అమలు చెయ్యడానికి తగిన చర్యలు తీసుకోవలెను.

విధేయులు.

(సుమా వర్మ)
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

 
  � @�s� x����NRPV���V ˳�LRi�d��R�V Lji��LRiV* ���LiNRPV yLjiZNP[ ¿�Li�j���so�y�LiVV.

1024 x 768 Lji����W�xtsQ��s][, H.B.5 ��sVLji�R�VV �y�sNTPsVLi����s �y����� BLiNSR�NRP�gS NRP��sxms�R�V�R�VLi�j�.