Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (131.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 13/04/2016
రిజర్వ్ బ్యాంక్‌చే " L" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 10 విలువగల నోట్లు జారీ

ఏప్రిల్ 13, 2016

రిజర్వ్ బ్యాంక్‌చే " L" అక్షరం నిగూఢంగా కలిగిన, ₹ 10 విలువగల నోట్లు జారీ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి సిరీస్‌-2005 క్రింద "L” అక్షరం నిగూఢంగా ఉండి, డా. రఘురామ్‌ రాజన్‌, గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్‌చే సంతకం చేయబడ్డ ₹ 10 విలువగల బ్యాంక్ నోట్లు జారీ చేస్తుంది. ముద్రించిన సంవత్సరం "2016" నోటు వెనుకవైపు ముద్రించి ఉంటుంది.

ఈనోట్ల నమూనా, రెండు నంబర్ ప్యానెళ్ళలో ఉన్న సంఖ్యలు – మొదటి మూడు అక్షర-సంఖ్యలు (ప్రిఫిక్స్) ఒకే పరిమాణంలో ఉండి, మిగిలిన సంఖ్యలు ఎడమనుంచి కుడికి ఆరోహణ క్రమంలో పెరగడం తప్ప, మిగిలిన అన్ని విధాలుగా, పూర్వం మహాత్మాగాంధీ సిరీస్-2005 క్రింద జారీ చేసిన ₹ 10 నోట్ల వలెనే ఉంటుంది.

నంబర్ ప్యానెళ్ళలో సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్న, ₹ 50, ₹ 100, ₹ 500, ₹ 1000 విలువగల బ్యాంక్ నోట్లు, ఇంతకు ముందే జారీ చేయబడ్డాయి.

ఇంతకు ముందు జారీ చేసిన అన్ని ₹ 10 విలువగల నోట్లూ, చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2015-2016/2413

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….