Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (301.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 21/08/2015
రూపాయి చిహ్నం “ ₹ ” తో, “L” అక్షరం అంతర్గతంగా ఉండి, నంబర్ ప్యానెల్ లో అంకెల పరిమాణం ఎడమనుంచి కుడికి పెరుగుతూ ఉండేట్లు అచ్చువేసిన, ₹ 1000 బ్యాంక్ నోట్ల జా

ఆగస్టు 21, 2015

రూపాయి చిహ్నం “ ₹ ” తో,  ‘L’  అక్షరం అంతర్గతంగా ఉండి, నంబర్ ప్యానెల్ లో అంకెల  పరిమాణం ఎడమనుంచి కుడికి   పెరుగుతూ ఉండేట్లు  అచ్చువేసిన, ₹ 1000 బ్యాంక్ నోట్ల జారీ.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధి సిరీస్ – 2005 లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డా. రఘురాం జి. రాజన్‌ సంతకంతో క్రొత్త ₹ 1000 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, ముందు వెనుక వైపుల " ₹ " చిహ్నం కలిగి, రెండు నంబరు ప్యానెళ్ళలో 'L' అక్షరం పొందుపరచి ఉంటాయి. ముద్రించిన సంవత్సరం '2015', నోటు వెనుకవైపు ముద్రించి ఉంటుంది.

ఈ నోట్ల నమూనా అన్నిరకాలుగా, మునుపు జారీ చేసిన మహాత్మా గాంధి సిరీస్ – 2005 నోట్ల లాగే ఉంటుంది. కానీ, రెండు నంబర్ ప్యానెళ్ళ లో అంకెల పరిమాణం, ఎడమనుంచి కుడికి పెరుగుతున్న క్రమంలో ముద్రించి ఉంటాయి. అయితే, ముందుచేర్చిన మొదటి మూడు అక్షర/సంఖ్యలు ఒకే పరిమాణంలో ఉంటాయి.

ఇలా నంబర్ ప్యానెళ్ళలో అంకెల పరిమాణం ఎడమ నుంచి కుడికి పెరుగుతున్న క్రమంలో గల ₹ 100, ₹ 500 నోట్లు, ఇంతకు ముందునుండే చలామణిలో ఉన్నాయి.

గతంలో జారీచేయబడ్డ అన్ని ₹ 1000 నోట్లు కూడా, చట్టపరంగా చలామణిలో కొనసాగుతాయి.

సంగీతా దాస్
డైరెక్టర్

పత్రికా ప్రకటన: 2015-2016/466

 
  © @¬sõ x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….